ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Jun 28 2026 7:12 AM | Updated on Jun 28 2026 7:12 AM

వెంకటాపురం(కె): ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని భద్రాచం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై 26మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల ఆభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ వేణుగోపాల్‌, డీటీ మహేందర్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సైయ్యద్‌ ముస్సేన్‌, మన్నెం సునీల్‌, జల్లిగంపల కళాధర్‌, చిట్టెం వాసు పాల్గొన్నారు.

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement