ములుగు రూరల్: జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. శనివారం డీఎంహెచ్‌ఓ కార్యక్రమంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ఆరోగ్యశాఖతో పాటు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రణాళిక ప్రకారం పోలియో కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. జిల్లాలో 22,572 మంది ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్నారని 312 బూతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 36 రూట్లు, బస్టాండ్ వద్ద బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప వైద్యాధికారి సుధీర్, వ్యాధి నిరోదక టీకాల నియంత్రణ అధికారి నాగఅన్వేష్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, రంజిత్, మాస్ మీడియా అధికారి సంపత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దుర్గారావు, సాంబయ్య, స్వరూప, సురేష్‌బాబు పాల్గొన్నారు.
30వరకు గడువు
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో 2026–27, 2027–28 విద్యా సంవత్సరాలకు వివిధ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తులకు ఈ నెల 30వ తేదీతో గడువు ముగుస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జుమ్లానాయక్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఐటీఐ తెలంగాణ వెబ్‌సైట్ ద్వారా ప్రవేశాలకు సంబంధించి 10వ తరగతి ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఐటీఐ భూపాలపల్లి కార్యాలయాన్ని, సెల్ నంబర్ 85004 65034ను సంప్రదించాలని సూచించారు.


