అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లలను పంపాలి | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లలను పంపాలి

Jun 28 2026 7:12 AM | Updated on Jun 28 2026 7:12 AM

ములుగు: తల్లిదండ్రులు చిన్న పిల్లలను మొదటగా అంగన్‌ వాడీ పాఠశాలలకు పంపాలని డీడబ్ల్యూఓ ప్రేమలత తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఎస్టీ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో ప్రథమ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం జరిగిన పాఠశాల సంసిద్ధత మేళా కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారంతో పాటు ప్రీ స్కూల్‌ కార్యక్రమాలను అన్ని విధాలుగా నిర్వహించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లల అభివృద్ధికి తోడ్పడేలా శారీరక, భాషా, మేధాభివృద్ధి పూర్వ గణితాభివృద్ధికి సంబంధించిన ఆట, పాటలు నేర్పించాలన్నారు. కార్యక్రమంలో ములుగు ప్రాజెక్ట్‌ సీడీపీఓ శిరీష, ఎస్టీ కాలనీ కార్పొరేటర్‌ స్వాతి, ప్రథమ్‌ ఫౌండేషన్‌ మాస్టర్‌ ట్రైనర్‌ నాగేశ్వర్‌రావు, సూపర్‌వైజర్‌ కళావతి, అంగన్‌వాడీ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

డీడబ్లూఓ ప్రేమలత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement