కన్నాయిగూడెం: విద్యార్థులకు మెనూ ప్రకారం ఆరోగ్యకరమైన భోజనంతో పాటు విద్యార్థుల అభ్యసన, పఠన సామర్థ్యాలను పెంచే విధంగా ఉపాధ్యాయులు పని చేయాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. శనివారం మండలకేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలుర వసతి గృహంతో పాటు గంగూడెంలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. అనంతరం పాఠ్య పుస్తకాలను ఉపాధ్యాయులతో కలిసి పంపిణీ చేశారు. విద్యార్థులు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా పీఓ లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ ముందస్తు అనుమతులు లేకుండా ఎవరైనా విధులకు గైరాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో


