ములుగు రూరల్: అసైన్డ్ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అసైన్డ్ భూమి సమితి రాష్ట్ర అధ్యక్షుడు కలకోటి మహేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మల్లంపల్లి మండలకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022లో హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన రైతుగర్జన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఈ మేరకు అసైన్డ్ రైతులకు భూమిపై పూర్తి హక్కులు కల్పిస్తామని ఇచ్చిన హామీని మరిచారని వెల్లడించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జితేందర్, సురేందర్, రాజు, శంకర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.


