రేపటి నుంచి 0–5 ఏళ్ల
చిన్నారులకు రెండు చుక్కలు
జిల్లాలోని పీహెచ్‌సీలు, సిబ్బంది కేటాయింపు వివరాలు
పోలియో చుక్కలతో లాభాలు..
ఏటూరునాగారం: చిన్నారుల నిండు జీవితానికి రెండు పల్స్‌పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో మహమ్మారిని నిర్మూలించవచ్చు.. ఈ మేరకు ప్రభుత్వం రేపటి(ఆదివారం) నుంచి మూడు రోజుల పాటు(మంగళవారం)పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలోని 0–5 పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. పోలియో రహిత సమాజ నిర్మాణానికి వైద్యాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఉదయం 7గంటలకే..
అటవీ ప్రాంతాలు, గోదావరి పరీవాహక ప్రాంతం, గొత్తికోయగూడేలు, గుట్టలపై ఉన్న గ్రామాలు, వాగు అవతల ఉన్న చిన్నారులను గుర్తించిన వైద్యాధికారులు 46 రూట్లను విభజించారు. ఈ రూట్లకు ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసింది. పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయం 7 గంటలకే పోలియో చుక్కలు వేసే కార్యక్రమం ప్రారంభం కానుంది.
బస్టాండ్లు.. పాఠశాలల్లో పిల్లలకు..
ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన వలస కూలీలు పిల్లలతో పాటు మిర్చి, ఇతర వ్యవసాయ పనులు, ఇటుక బట్టీలు, భవన నిర్మాణ కార్మికులు నివాస ప్రాంతాలకు సైతం టీంలను పంపనున్నారు. ఐరిస్క్ ఏరియాలను గుర్తించి వైద్యాధికారులు, సబ్ సెంటర్ల సిబ్బంది అక్కడికి వెళ్లే ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇదేకాకుండా ఆర్టీసీ బస్టాండ్, అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు ప్రభుత్వ పాఠశాలల పరిధిలోని పిల్లల వద్దకు సైతం వైద్య సిబ్బంది వెళ్లి చుక్కలు వేయనున్నారు. అయితే పోలియో చుక్కలు వేయించడం ద్వారా కలిగే లాభాలపై
మూడు రోజుల పాటు కార్యక్రమం
15 పీహెచ్‌సీల పరిధిలో టీంల ఏర్పాటు
జిల్లా వ్యాప్తంగా 22,572 మంది
చిన్నారులు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 15
సబ్ సెంటర్లు 89
జిల్లాలోని చిన్నారులు 22,572
మొబైల్ బృందాలు 15
రూట్ సూపర్‌వైజర్లు 46
పోలియో చుక్కలు వేసే స్టాల్స్ 312
పోలియో చుక్కలు వేయించడం ద్వారా చిన్నారులకు పోలియో రాదు. అంగవైకల్యాన్ని నివారించడంతో పాటు జీవితాంతం రక్షణ ఉంటుంది. సురక్షితమైన, ఉచితమైన ఈ మందును తప్పకుండా చిన్నారులందరికీ తప్పకుండా వేయించాలని సోషల్ మీడియా, వాల్‌పోస్టర్లు, ఇతర ప్రధాన కూడళ్లలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని వైద్యాధికారులు చేపట్టారు. పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం, విరేచనాలు ఉన్నా కూడా ఈ పోలియో చుక్కలను వేయించవచ్చని అధికారులు చెబుతున్నారు.


