స్కావెంజర్లను తొలగించొద్దు | - | Sakshi
Sakshi News home page

స్కావెంజర్లను తొలగించొద్దు

Jun 27 2026 12:37 AM | Updated on Jun 27 2026 12:37 AM

ఏటూరునాగారం: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్లను తొలగించవద్దని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యనమల్ల ప్రవీన్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన స్కావెంజర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని చోట్ల పార్ట్‌ టైం స్వీపర్లు ఉన్న వద్ద స్కావెంజర్లను తొలగిస్తామని ఎంఈఓలు తెలిపారన్నారు. స్కావెంజర్ల బదులుగా పార్ట్‌టైం స్వీపర్లను నియమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసిందని ప్రవీన్‌ తెలిపా రు. దీంతో రాష్ట్రంలో రెండు వేల మంది స్కావెంజర్లు ఉపాధి కోల్పోవాల్సి వస్తుందన్నారు. పాఠశాలల్లో అన్ని రకాల పనులు చేస్తూ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పనిచేస్తున్న స్కావెంజర్లను తొలగించాలని చూడడం సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలని కోరా రు. ఈ కార్యక్రమంలో రమ, కౌసల్య, నవీన్‌, శ్రీరా ములు, లక్ష్మీ, రాజేశ్వరి, ఉమారాణి, తిరుమల, రాధిక, ఎలేంద్ర, ఆదినారాయణ పాల్గొన్నారు.

సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీన్‌కుమార్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement