ములుగు రూరల్: మల్లంపల్లి–ములుగు జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఒకవైపున ఉన్న రోడ్డు ధ్వంసమై ప్రమాదభరితంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మల్లంపల్లి కెనాల్‌పై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు ఒక్క వైపు పూర్తికాగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. మరో వైపు పిల్లర్ల పనులు జోరుగా సాగుతున్నాయి. జాతీయ రహదారిపై నిత్యం ఇసుక లారీల రవాణా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో రోడ్డు ఒకవైపున గురువారం రోడ్డు ధ్వంసమైంది. గుర్తించిన అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేసి వన్‌వేలో వాహనాలను తరలిస్తున్నారు. రెండో పక్క పిల్లర్ల నిర్మాణంలో భాగంగా రోడ్డు అంచువరకు మట్టిని తొలగించడం,డ్రిలింగ్ చేయడంతో రోడ్డు కింది భాగంలో మట్టి కదిలి రోడ్డు బీటలువారింది. అధికారులు రోడ్డు పనులను త్వరితగతిన, నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.


