ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి

Jun 26 2026 7:39 AM | Updated on Jun 26 2026 7:39 AM

మల్హర్‌(కాటారం): స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌ వెన్నెల పిలుపునిచ్చారు. గురువారం కాటారం మండలం గంగారంలో జరిగిన టీఎస్‌ఎస్‌ కళాకారిణి జాడి సుమలత వివాహ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతీ పౌరుడికి ఎంతో విలువైనదన్నారు. ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకొని ఎన్నికల సమయంలో తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. యువత ప్రత్యేకంగా ముందుకు వచ్చి ఓటరు నమోదు ప్రక్రియలో పాల్గొనాలని, తమ కుటుంబ సభ్యులు, పరిచయస్తులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతీ ఓటు ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు.

సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌ వెన్నెల

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement