మంగపేట: మండల పరిధిలోని రామచంద్రునిపేటలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాన్ని ఎన్‌పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ భిక్షపతి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామచంద్రునిపేటలో నూతనంగా 33/11కేవీ విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు చేసేందుకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు. స్థలాన్ని అప్పగించిన అనంతరం టెండర్ తర్వాత నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వివరించారు. అనంతరం వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల సందర్భంగా చుంచుపల్లి గోదావరి ఒడ్డున నూతనంగా నిర్మించనున్న పుష్కరఘాట్ ప్రదేశాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ పురుషోత్తం, అసిస్టెంట్ ఇంజనీర్ కృష్ణారావు పాల్గొన్నారు.


