సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ఎకై ్సజ్ శాఖలో భారీస్థాయిలో బదిలీలు చేపట్టింది. డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారుల (డీపీఈఓ) స్థాయిల్లో జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు అధికారులు ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. అదే సమయంలో ఇతర జిల్లాల నుంచి కొందరు అధికారులు వరంగల్ అర్బ న్ (హనుమకొండ), వరంగల్ రూరల్ (వరంగల్), ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల్లో పోస్టింగ్ పొందారు.
అంజన్‌రావుకు ప్రమోషన్..
వరంగల్ డిప్యూటీ కమిషనర్ అంజన్‌రావుకు జాయింట్ కమిషనర్‌గా ప్రమోషన్ రాగా,, ఇన్‌చార్జ్ డీసీగా కూడా ఉన్నారు. ఈ బదిలీల్లో డీజీబీసీఎల్ ఆర్‌ఆర్–1 చీఫ్ మేనేజర్‌గా ఉన్న హెచ్.దత్తురాజ్‌గౌడ్‌ను వరంగల్ డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు. మల్కాజిగిరి డీపీఈఓ కె.నవీన్‌కుమార్‌కు వరంగల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్‌గా పోస్టింగ్ లభించింది. హనుమకొండ డీపీఈఓగా పనిచేస్తున్న కె.చంద్రశేఖర్‌కు ఇటీవల అసిస్టెంట్ కమిషనర్‌గా పదోన్నతి లభించగా ఆయనను టీజీబీసీఎల్ చీఫ్ మేనేజర్‌గా నియమించారు. ఆయన స్థానంలో కరీంనగర్ డీపీఈఓ పి.శ్రీనివాస్‌రావును వరంగల్ అర్బన్ డీపీఈఓగా, వరంగల్ రూరల్ డీపీఈఓ డి.అరుణ్‌కుమార్‌ను నిజామాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏసీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో సంగారెడ్డికి చెందిన ఎం.మణెమ్మను వరంగల్ రూరల్ డీపీఈఓగా నియమించారు. భూపాలపల్లి డీపీఈఓ వి.శ్రీనివాస్‌ను నిర్మల్‌కు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వరంగల్‌లో పనిచేస్తున్న డి.శ్రీనివాస్‌రెడ్డిని వికారాబాద్ డీపీఈఓగా పంపించారు. జనగామ డీపీఈఓ కె.అనితకు సూర్యాపేట బాధ్యతలు అప్పగించారు. భూపాలపల్లి (ఏపీఈఎస్) ఎం.లింగాచారి వనపర్తి డీపీఈఓగా బదిలీ చేశారు.
ఐదు నెలల నిరీక్షణకు తెర...
ఎట్టకేలకు పోస్టింగ్
ఐదు నెలలుగా పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్న అధికారులకు ఎట్టకేలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జనవరి చివరన పలువురికి ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ (ఏపీఈఎస్)లకు జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ (డీపీఈఓ)లుగా, డీపీఈఓలకు అసిస్టెంట్ కమిషనర్(ఏసీ)లుగా, ఏసీలకు డిప్యూటీ కమిషనర్ (డీసీ)లుగా పదోన్నతి కలిగింది. అయితే, పదోన్నతులు పొందినప్పటికీ ఆ అధికారులు పాతస్థానాల్లోనే ఐదు నెలలుగా కొనసాగుతున్నారు. పదోన్నతుల తర్వాత విధుల కేటాయింపు లేకపోవడంతో పలువురు అధికారులు తాత్కాలిక ఏర్పాట్లతో కొనసాగాల్సి వచ్చింది. జిల్లాలు, విభాగాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ పోస్టింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో అసంతృప్తి వ్యక్తమైంది. అయితే, తాజాగా ప్రభుత్వం ఒకేసారి డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, డీపీఈఓ, ఏపీఈఎస్ స్థాయి అధికారులకు పోస్టింగ్ ఇవ్వడంతో ఐదు నెలలుగా ఎదురుచూస్తున్న వారికి ఊరట లభించింది.
డిప్యూటీ కమిషనర్, ఏసీ,
డీపీఈఓలకు స్థానచలనం
వరంగల్ డీసీగా దత్తురాజ్‌గౌడ్.. ఏసీగా నవీన్‌కుమార్
హనుమకొండ డీపీఈఓగా శ్రీనివాస్‌రావు.. వరంగల్‌కు మణెమ్మ
ఉమ్మడి వరంగల్‌లో అధికారుల రాకపోకలు.. పలువురికి కొత్త బాధ్యతలు


