ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Jun 26 2026 7:39 AM | Updated on Jun 26 2026 7:39 AM

ఏటూరునాగారం: దీర్ఘకాలిక ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రైతుసంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ జగదీశ్వర్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోయగూడెం–ఎల్లాపూర్‌ శివారులోని 105 సర్వే నంబర్‌లో 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పేదల భూములకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. యూరియా కొరకు యాప్‌ తీసుకొచ్చారని యాప్‌లో బుక్‌ చేసుకోవడానికి రైతులందరి వద్ద స్మార్ట్‌ఫోన్లు లేవని తెలిపారు. ఒకవేళ ఉన్నా ఏజెన్సీలో సిగ్నల్స్‌ అంతంత మాత్రంగానే ఉంటుందని తెలిపారు. పాత పద్ధతిలోనే ఎరువులు అందజేయాలన్నారు. భూ భారతి రెవెన్యూ రికార్డులో కాస్తు కబ్జా కాలాన్ని వెంటనే పునరుద్ధరించాలని, రైతు రుణాలు మాఫీ చేయాలని కోరారు. సన్నధాన్యానికి ఇస్తానన్న క్వింటాకు రూ.500 బోనస్‌ అందరికీ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం మండల కార్యదర్శి ఎండి.యాకూబ్‌, మండల కమిటీ సభ్యుడు బండారి నరసింహులు, కై రుల్లా, గుండపు నాగులు, పుట్ట రాజయ్య, జూపాక నరసయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎండి దావూద్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతుసంఘం జిల్లా కార్యదర్శి వెంకటరెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement