సామాజిక సేవ అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

సామాజిక సేవ అభినందనీయం

Jun 25 2026 12:54 AM | Updated on Jun 25 2026 12:54 AM

ఎస్‌ఎస్‌తాడ్వాయి: యువత పేదలు, వృద్ధులకు అండగా నిలవడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. మండలంలోని ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామంలో ఫ్రీవిల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 30 మంది వృద్ధుల కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను బుధవారం మంత్రి సీతక్క చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కరోనా కాలంలో ప్రజలకు చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని యువత ఫ్రీవిల్‌ ఫౌండేషన్‌ను స్థాపించి సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు. పేదలకు సహాయం చేయడం దేవుడిచ్చిన వరమని పేర్కొన్నారు. సమాజంలో అవసరమైన వారికి చేయూతనివ్వడానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రీవిల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, ఆర్గనైజేషన్‌ సెక్రటరీ జాలిగపు జంపన్నను అభినందించారు. అంతకుముందు మంత్రికి గ్రామస్తులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రవిచందర్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కల్యాణి, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్‌, మేడారం ట్రస్ట్‌ బోర్డు మాజీ చైర్మన్‌ లచ్చు పటేల్‌, ఉపసర్పంచ్‌ కాక రంజిత్‌, మండల మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు గొంది సరిత, అనంతరెడ్డి, ఇర్ప సునీల్‌, కట్కూరి భాస్కర్‌రెడ్డి, శోభన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement