నిరుపేదలకు ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ చేయూత | - | Sakshi
Sakshi News home page

నిరుపేదలకు ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ చేయూత

Jun 25 2026 12:54 AM | Updated on Jun 25 2026 12:54 AM

వెంకటాపురం(ఎం): మండలంలోని ఇంచెంచెరువుపల్లి గ్రామానికి చెందిన నూనావత్‌ మోహన్‌ దాస్‌, బండి నర్సమ్మ ఇళ్లు మంగళవారం కురిసిన వర్షానికి కూలిపోయాయి. విషయం తెలుసుకున్న ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యుడు, జిల్లా ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్‌ అల్లెం అప్పయ్య దృష్టికి తీసుకురాగా, స్పందించిన ఆయన రెండు కుటుంబాలకు ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో అవసరమైన సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ.. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఎల్లప్పుడూ నిరుపేదలకు, ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ వైస్‌ చైర్మన్‌ గంగిశెట్టి శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement