గోవిందరావుపేట: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల వెంకట్‌రెడ్డి మాట్లాడు తూ.. ఖరీఫ్ సీజన్‌లో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచి భారం మోపిందన్నారు. గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరఫరాలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. రైతు భరోసా సకాలంలో అందడం లేదన్నారు. రైతుల మోటా ర్లకు స్మార్ట్ మీటర్లు అమలు చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంక్ రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే సాదా బైనామా దరఖాస్తుదారులకు పట్టా లు, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గుండు రామస్వామి, తీగల ఆదిరెడ్డి, కోటేశ్వరరావు, సోమ మల్లారెడ్డి, రెడ్డి పురుషోత్తం రెడ్డి, గొర్ల శ్రీను, సోలిపురం రాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు పొదిలి చిట్టిబాబు, కందుల రాజేశ్వరీ, లకావత్ నరసింహ పాల్గొన్నారు.
రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి
వెంకట్‌రెడ్డి


