భూపాలపల్లి అర్బన్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించా లని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక అధికారి ఎన్.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై బుధవారం కలెక్టరేట్‌లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్‌శర్మ వివిధ శాఖలు చేపట్టిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి శ్రీధర్ మాట్లాడుతూ.. గ్రామసభల్లో మొత్తం 6,391 దరఖాస్తులు అందగా, వాటిలో 716 పరిష్కరించబడ్డాయని, మి గిలిన 5,674 దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పింఛన్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, విద్యుత్, సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి సౌకర్యాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు సంబంధించిన దరఖాస్తులు అధికంగా వచ్చినట్లు తెలిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. 99 రోజుల కార్యక్రమాన్ని ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించామన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక అధికారి ఎన్.శ్రీధర్


