భువన్‌ సర్వేతో ఆస్తుల నమోదు | - | Sakshi
Sakshi News home page

భువన్‌ సర్వేతో ఆస్తుల నమోదు

Jun 25 2026 12:54 AM | Updated on Jun 25 2026 12:54 AM

ములుగు: పట్టణంలోని ఆస్తుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేసి, పన్నుల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడం కోసం ములుగు మున్సిపాలిటీ పరిధిలో భువన్‌ సర్వే నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌ తెలిపారు. ములుగు పట్టణంలో భువన్‌ సర్వేను ప్రారంభించిన అనంతరం ఆయన ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి భవనాల కొలతలు తీసుకోవడం, జియో ట్యాగింగ్‌ నిర్వహించడం, ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేస్తారని తెలిపారు. భవనాల విస్తీర్ణం, వినియోగ విధానం వంటి కీలక వివరాలను సేకరించి భువన్‌ పోర్టల్‌లో నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ములుగు పట్టణంలోని వివిధ వార్డుల్లో సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలనలు కొనసాగిస్తూ, ఆస్తుల సమాచారాన్ని నవీకరిస్తున్నాయన్నారు. సర్వేకు పట్టణ ప్రజలు మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించి, తమ ఇళ్లు, భవనాలకు సంబంధించిన సరైన వివరాలను అందించాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement