కండక్టర్‌ నిజాయతీ.. | - | Sakshi
Sakshi News home page

కండక్టర్‌ నిజాయతీ..

Jun 24 2026 12:53 AM | Updated on Jun 24 2026 12:53 AM

ములుగు: హనుమకొండ డిపోకు చెందిన బస్సు మంగళవారం పత్తిపల్లి నుంచి హనుమకొండకు వెళ్తుండగా పత్తిపల్లికి చెందిన వృద్ధ దంపతులు బస్సు ఎక్కి ములుగులో దిగిపోయారు. కొంత సేపటికి వారి వెంట ఉన్న సంచిని బస్సులోనే మరిచిపోయినట్లు గమనించి స్థానికంగా విధులు నిర్వహిస్తున్న బైకని మోహన్‌ని కలిసి వృద్ధ దంపతులు సంచి మర్చిపోయిన విషయం తెలిపారు. అతను వెంటనే బస్‌ కండక్టర్‌ ధనలక్ష్మికి ఫోన్‌లో సమాచారం అందించగా ఆమె సంచిని గుర్తించారు. అనంతరం వృద్ధ దంపతులు ములుగుకు చేరుకుని రూ.20వేల నగదుతో పాటు ఇతర వస్తువులు ఉండగా కంట్రోలర్‌ మూర్తి సమక్షంలో సంచిని వారికి అప్పగించారు. నిజాయతీగా వ్యవహరించిన కండక్టర్‌ ధనలక్ష్మిని స్థానికులు, ప్రయాణికులు అభినందించారు.

వృద్ధ దంపతులకు రూ.20 వేల నగదు అందజేత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement