– మరిన్ని వార్తలు, ఫొటోలు 8లోu
ఏటూరునాగారం : మండల పరిధిలోని కొండాయి–దొడ్ల గ్రా మాల మధ్య జంపన్నవాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు వరదలకు తెగిపోయింది. దీంతో మల్యాల, కొండాయి, ఐలాపురం, కొత్తూరు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఏడాది మేడా రం జాతర సమయంలో రూ. 30లక్షలు ఖర్చు చేసి జంపన్నవాగు బ్రిడ్జికి ఇరువైపులా తాత్కాలికంగా డై వర్షన్ రోడ్డు నిర్మించారు. ఈ క్రమంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి జంపన్నవాగు ఉప్పొంగడంతో రెండు రోడ్లు పూర్తిగా తెగిపోయాయి. ఫలితంగా వాగు అవతల గ్రామాల ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. బ్రిడ్జి పనులు పిల్లర్ల వరకు పూర్తి కాగా దానిపై గడ్డర్స్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ వర్షంతో వచ్చే వరదల కారణంగా బ్రిడ్జి పనులు కూడా నిలిచినట్లు స్థానికులు, అధికారులు చెబుతున్నారు. వర్షాలు ముగిసి వరద నిలిస్తే తప్పా పనులు చేపట్టే అవకాశం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.


