బీఆర్‌ఎస్‌ హయాంలోనే అవినీతి | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ హయాంలోనే అవినీతి

Jun 24 2026 12:53 AM | Updated on Jun 24 2026 12:53 AM

ములుగు: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని, అన్నారం మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మించకముందే పూడికతీత పేరుతో 6 కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను అక్రమంగా తరలించి వేలాది కోట్ల రూపాయలు దోచుకున్నారని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌ ఆరోపించారు. ములుగులో మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రవిచందర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీతమ్మ సాగర్‌ డీసీల్టేషన్‌ తీయాలని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే మ్యాప్‌ రూపొందించిందన్నారు. డీసీల్టేషన్‌తో గిరిజన సొసైటీలు లబ్ధిపొందకుండా బీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుపడుతున్నారన్నారు. మంత్రుల మీద నిందలు వేసి అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ తన సోషల్‌ మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని, బీఆర్‌ఎస్‌ నేతల దగ్గర ఎమైనా ఆధారాలు ఉంటే తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్‌గౌడ్‌, నాయకులు పల్లె జయపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మామిడిశెట్టి కోటి, రాహుల్‌, భరత్‌కుమార్‌, మారం సుమన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement