ములుగు: జిల్లాలో ఇసుక మాఫియా వెనుక ఉన్న సూత్రధారులను బయటకు లాగేవరకు ఊరుకునేది లేదని మాజీ రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఇసుక మాఫీయాపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హేమంత్ సహదేవరావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సతీశ్‌రెడ్డి సోమవారం విలేకర్లతో మాట్లాడారు. వెంకటాపురం(కె), వాజేడు, మంగపేట మండలాల్లో సీతమ్మ సాగర్ పేరు మీద డిసిల్టేషన్ పేరుతో 12 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను తీసేందుకు దరఖాస్తు చేస్తే, కోటి క్యూబిక్ మీటర్లకు అధికారులు అనుమతులు ఇచ్చారని వెల్లడించారు. 4 వేల కోట్ల అక్రమార్జనకు మంత్రులు స్కెచ్ వేశారని కేటీఆర్ చెబితే తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. 72 గిరిజన, మ్యాక్స్ సొసైటీలు దరఖాస్తు చేసుకుంటే ఏ ఒక్క సొసైటీకి అధికారులు అనుమతి ఇవ్వలేదన్నారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోకుంటే సీఎస్ వరకు వెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు రమేశ్‌రెడ్డి, రమణారెడ్డి, మహేశ్‌నాయక్, మల్క రమేశ్, భిక్షపతి, కోగిల మహేశ్, చంద్రమౌళి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రెడ్కో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డి


