ప్రజాపాలన అమలులో ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

ప్రజాపాలన అమలులో ఆదర్శం

Jun 24 2026 12:53 AM | Updated on Jun 24 2026 12:53 AM

ములుగు: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక అమలులో జిల్లా ఆదర్శంగా నిలిచిందని ప్రజాపాలన ప్రత్యేకాధికారి హనుమంత్‌ జెండగే వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన పురోగతి, శాఖల వారీ విజయాలు, అమలు చేసిన వినూత్న కార్యక్రమాలపై మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు జిల్లాలో అన్ని శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాల పురోగతిని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ప్రజావాణి, గ్రామసభల ద్వారా అందిన భూ సమస్యలు, ఇతర సమస్యలకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌, డీఎఫ్‌వో వికాస్‌ మీనా, అదనపు కలెక్టర్‌ మహేందర్‌ జీ, డీఆర్వో రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాపాలన ప్రత్యేకాధికారి

హనుమంత్‌ జెండగే

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement