● రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంజద్‌పాషా
ములుగు రూరల్: పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలిన తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంజద్‌పాషా అన్నారు. జిల్లా కేంద్రంలో రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైతుసంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలన్నారు. పంటల బీమా పథకాన్ని రూపొందించి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవాలని కోరారు. ప్రతీ మండలానికి ఒక సర్వేయర్‌ను కేటాయించి గ్రామాల్లో హద్దుల సమస్యను పరిష్కరించాలన్నారు. రైతు భరోసా డబ్బులు తక్షణమే చెల్లించాలని కోరారు. యాసంగి సన్నధాన్యం బోనస్ డబ్బులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణసింగ్, నటరాజ్, కృష్ణయ్య, రమేష్, రాజయ్య, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


