స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని శివునిపల్లికి చెందిన ఆశ్రమ పాఠశాలలో సీఆర్‌టీ ఉద్యోగం ఇప్పించాలని ఓ గిరిజనుడు పీఓకు విన్నవించారు. ఏటూరునాగారం మండలం గంటలకుంటలో విద్యుత్ సరఫరా, బోర్లు, మోటార్లు ఇప్పించాలని గొత్తికోయలు వేడుకున్నారు. కేసముద్రానికి చెందిన ధరావత్ కిషన్ ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా భూమిలో ఆయిల్ పామ్ తోటకు సోలార్, బోర్‌వెల్, మోటారు పంపు మంజూరు చేయాలని పీఓను వేడుకున్నారు. వెంకటాపురం(కె) మండలంలోని మరికాలలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా రైతుల మోటార్లు సరిగా నడవడం లేదని కెపాసిటికి అనుగుణంగా మరో ట్రాన్స్‌ఫార్మర్ ఇవ్వాలని వేడుకున్నారు. ఇలా పలువురు బాధితులు తమ సమస్యలను పీఓకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డీసీ ప్రతాప్, డీడీ ఫిరంగి, ఈఈ వీరభద్రం, డీటీ అనిల్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్, జీసీసీ డీఎం వాణి, జేడీఎం కొండల్‌రావు, జియాలజిస్ట్ కిశోర్, పెసా కో ఆర్డినేటర్ ప్రభాకర్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.


