రాజీమార్గమే రాజమార్గం | - | Sakshi
Sakshi News home page

రాజీమార్గమే రాజమార్గం

Jun 21 2026 12:43 AM | Updated on Jun 21 2026 12:43 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌వీపీ సూర్య చంద్రకళ

ములుగు: రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌వీపీ.సూర్య చంద్రకళ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ ఆదాలతో 588 కేసులను పరిష్కరించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ కక్షిదారులు తమ సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా సమయంతో పాటు డబ్బు కూడా ఆదా ఆవుతుందన్నారు. సివిల్‌, క్రిమినల్‌, ప్రమాదాలు, బ్యాంకు రికవరీ తదితర కేసులను పరస్పర అవగాహనతో రాజీ పద్ధతిలో కేసులు ముగిసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.

గాలివాన బీభత్సం..

ఎగిరిపోయిన పాఠశాల పైకప్పు

ఏటూరునాగారం: మండలం పరిధిలోని కొమురం భీం నగర్‌లో శుక్రవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో ప్రభుత్వ పాఠశాల పైకప్పు ఎగిరిపోయింది. శనివారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఎగిరిపోయిన పైకప్పును చూసి ఆశ్చర్యపోయారు. గతేడాది పాఠశాల భవనం మంజూరు చేశారు. కానీ పక్కా భవనం నిర్మించకపోవడంతో తాత్కాలికంగా గొత్తికోయలు పెంకుటిల్లు ఏర్పాటు చేసి పిల్లల పెంకుటిల్లులోనే కొనసాగిస్తున్నారు. ఈ పాఠశాలలో 26 మంది విద్యార్థులకు గాను 11 మంది విద్యార్థులు చదువుతుండగా మిగతా విద్యార్థులు శనివారం హాజరు కాలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పక్కా భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement