● అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్‌జీ
ములుగు: బాయిల్డ్ రైస్ మిల్లింగ్ ప్రక్రియలో రైస్‌మిల్లర్లు సమన్వయంతో పనిచేసి సకాలంలో పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్‌జీ సంబంధిత అధికారులను, రైస్ మిల్లర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో బాయిల్డ్ రైస్ మిల్లర్లతో సమన్వయ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ధాన్యం సేకరణ, మిల్లింగ్ ప్రక్రియను ఆటంకాలు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మిల్లర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. మిల్లింగ్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ఫైజల్ హుస్సేన్, డీఎం కృష్ణవేణి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్, రైస్ మిల్లర్లు, అధికారులు పాల్గొన్నారు.


