ఉరుములు, మెరుపులు | - | Sakshi
Sakshi News home page

ఉరుములు, మెరుపులు

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

మంగపేటలో భారీ వర్షం

నిలిచిన విద్యుత్‌ సరఫరా

మంగపేట: మండలవ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి భారీ గాలులు, చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం 9.30 గంటల వరకు కమలాపురం, మంగపేట, మల్లూరు, రాజుపేట, తదితర గ్రామాల్లో వర్షం దంచికొట్టింది. మధ్యాహ్నం మండుటెండ, వడగాలులతో నిప్పుల కొలిమిలా మారిన వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా చల్లబడింది. తీవ్రమైన గాలుల వర్షంతో మండలవ్యాప్తంగా రాత్రి 10 గంటల వరకు విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గాలులతో కూడిన వర్షానికి రాజుపేట ప్రధాన సెంటర్‌లో చెట్టుకొమ్మలు విరిగి పడటంతో విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. దీంతో ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్‌ రెండు గంటల పాటు నిలిచి పోయింది. వర్షం నిలిచి పోవడంతో రోడ్లపై అడ్డంగా పడిన చెట్ల కొమ్మలను తొలిగించడంతో రాక పోకలు యథావిధిగా కొనసాగాయి. వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడడంతో రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement