ములుగు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని ములుగు మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీపీఎస్‌లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు యూనిఫాం, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్‌ను ప్రభుత్వం అందిస్తుందన్నారు. అనంతరం ఉపాధ్యాయులు చైర్‌పర్సన్‌ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ప్రదానోపాధ్యాయురాలు ఉమాదేవి, ఉపాధ్యాయులు ముకుందరెడ్డి, స్వాతి, రజిత, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు
పంపించాలి
విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని ములుగు సీడీపీఓ శిరిష అన్నారు. శుక్రవారం మల్లంపల్లి మండలం మంచినీళ్లపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బడిబాట నిర్వహించగా ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధి సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారన్నారు. ఉపాధ్యాయుడు ఉమాశంకర్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ కమరున్నీస, టీచర్ ప్రియాంక, రజిత, తదితరులు పాల్గొన్నారు.


