వనమహోత్సవానికి సిద్ధం | - | Sakshi
Sakshi News home page

వనమహోత్సవానికి సిద్ధం

Jun 19 2026 1:00 AM | Updated on Jun 19 2026 1:00 AM

171 గ్రామ పంచాయతీల్లో మొక్కలు శాఖల వారీగా లక్ష్యం

మండలాల వారీగా జీపీలు,

నర్సరీల్లోని మొక్కల వివరాలు

జీపీ నర్సరీల్లో 5,64,950 మొక్కలు

వనమహోత్సవ లక్ష్యం పూర్తి చేస్తాం

ములుగు రూరల్‌: గ్రామాలలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాస్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది వర్షా కాలంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 12లక్షల 305 మొక్కలను నాటేందుకు లక్ష్యం నిర్ధేశించారు. నీడ, పండ్ల మొక్కలు నాటేందుకు పంచాయతీ న ర్సరీలు, మరికొన్ని అటవీశాఖ నర్సరీలలో మొక్కల పెంపకం చేపట్టి అధికారులు నాటేందుకు సిద్ధం చేశారు. నాటిన మొక్కలను సంరక్షించేలా చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం వర్చువల్‌గా వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో జిల్లాలో అధికారులు వనమహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలు నాటారు.

జిల్లాలోని పది మండలాల పరిధిలో మొత్తం 171 పంచాయతీలు ఉండగా ప్రతీ గ్రామ పంచాయతీలో ఒక్కో నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. ప్రతిఏటా జాన్‌ నెలలో వవనమహోత్సవ కార్యక్రమం చేపడుతున్నారు. అందుకు అనుగుణంగా జిల్లాలోని గ్రామ పంచాయతీ నర్సరీలలో 5,64,950 మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉంచారు. ఇందులో అత్యధికంగా నీడ, పండ్ల మొక్కలు, నేరేడు, వేప, చింత, సిస్సో, అర్నమెంటర్‌ స్లాంట్స్‌, మునగ, మందార, కానుగ, గుల్‌ మొహర్‌, గులాబీ మొక్కలతో పాటు ఈ ఏడాది డ్రాగన్‌ ప్రూట్‌, కర్జూర మొక్కలు పెంచుతున్నారు. ఈ మేరకు ప్రతీ ఇంటికి మొక్కలను పంపిణీ చేయనున్నారు. దీంతో పాటు అటవీశాఖ నర్సరీలలో మరికొన్ని మొక్కలను పెంచుతున్నారు.

జిల్లాలో శాఖల వారీగా వనమహోత్సవ టార్గెట్‌ను కలెక్టర్‌ ఆధ్వర్యంలో కేటాయించారు. ఇందులో డీ ఆర్‌డీఏకు అత్యధికంగా 5 లక్షలు, అటవీ శాఖ 3.50లక్షలు, వ్యవసాయశాఖ 1.20 లక్షలు, పోలీస్‌ శాఖ 80 వేలు టార్గెట్‌ కేటాయించారు. అలాగే హ ర్టికల్చర్‌ 50 వేలు, ఇరిగేషన్‌కు 15వేలు, మున్సిపాలిటీ 80 వేలు, విద్యాశాఖకు 10 వేలు, పశుసంవర్థకశాఖ 3 వేలు, హెల్త్‌ డిపార్టుమెంట్‌ 500, ఎలక్ట్రిసిటీ వెయ్యి, ట్రైబల్‌ వెల్ఫేర్‌కు 20 వేలు, ఇతర శాఖలు వెయ్యి మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

మండలం జీపీలు మొక్కలు

ములుగు 19 58,600

మల్లంపల్లి 10 37,000

వెంకటాపురం(ఎం) 23 80,090

గోవిందరావుపేట 18 68,000

ఎస్‌ఎస్‌తాడ్వాయి 18 58,600

ఏటూరునాగారం 12 37,060

కన్నాయిగూడెం 11 34,000

మంగపేట 25 78,000

వెంకటాపురం(కె) 18 59,600

వాజేడు 17 54,000

శాఖల వారీగా టార్గెట్‌ కేటాయింపు

మిగతావి అటవీశాఖ నర్సరీలలో

పెంపకం

వనమహోత్సవ జిల్లా లక్ష్యం పూర్తి చేస్తాం. శాఖ ఆధ్వర్యంలో 5 లక్షలు టార్గెట్‌ ఇచ్చారు. ఇంటింటికీ పంపిణీ చేసే మొక్కలు 2.90లక్షలు. మిగతా మొక్కలు ఖాళీ ప్రదేశాలు, గుడి, పాఠశాల ఆవరణలో నాటిస్తాం. ప్రజలు నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి.

– చంద్రశేఖర్‌, డీఆర్‌డీఓ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement