ఏటూరునాగారం: మండల పరిధిలోని ఆకులవారిఘణపురం రాళ్లకుంట చెరువు శిఖం భూమిలో స్థానికేతర ఆదివాసీలు అక్రమంగా గుడిసెలు వేశారు.. దీన్ని నిరసిస్తూ ఏటూరునాగారం జేఏసీ ఇచ్చిన బంద్ గురువారం విజయవంతమైంది. మండల కేంద్రంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అక్రమదారులను శిఖం భూ ముల నుంచి తరలించడంతో స్థానికులు చేపడుతామన్న ర్యాలీని విరమించుకున్నారని నాయకుడు శ్రీనివాస్ తెలిపారు. అనంతరం రామాలయంలో ఏటూరునాగారం జేఏసీ కమిటీని ఎన్నుకున్నారు. పోలీసుల బందోబస్తు
గిరిజనులు, గిరిజనేతరుల మధ్య రగులుతున్న భూ వివాదం చిచ్చును చల్లార్చేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు. 164 సెక్షన్ అమలులో ఉండడంతో ఏఎస్పీ మనన్ భట్ ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాస్, ఎస్సైలు మహేశ్, సూరి, వెంకటేశ్‌తో పాటు స్పెషల్ పార్టీ సిబ్బంది నాఖాబంది ఏర్పాటు చేశారు. ఐటీడీఏ, క్రాస్‌రోడ్డు, ఐటీఐ వెనుకాల కొత్తగుడిసెల సమీపంలో పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. అలాగే చెరువు శిఖం భూమిలో వేసిన గుడిసెలను పోలీసులు ఖాళీ చేయించడంతో సమస్య సద్దుమణిగింది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
వ్యాపార, వాణిజ్య సముదాయాల
మూసివేత
సమస్యాత్మక ప్రాంతాల్లో
పోలీసుల బందోబస్తు


