వెంకటాపురం(కె): అక్రమ అరెస్టులతో ఆదివాసీల భూ ఉద్యమాన్ని ఆపలేరని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కొర్సా నర్సింహమూర్తి అన్నారు. ఏటూరునాగారంలోని భూ పోరాటం చేస్తున్న ఆదివాసీ మహిళలకు అండగా వెళ్తున్న ఆది వాసీ నాయకులను పోలీసులు గురువారం హౌస్ అరెస్టు చేయటం సరికాదన్నారు. పలువురు ఇరువర్గాల మధ్య ఘర్షణ పేరుతో ప్రజలను తప్పదోవ పట్టించేందుకు చూస్తున్నారని దుయ్యబట్టారు. చట్టాల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పాలకులు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు గిరిజనుల గిరిజనేతరుల మధ్య గొడవ సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేశ్, శంకర్, నారా యణ, రామలక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ నవనిర్మాణ సేన
రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహమూర్తి


