మొక్కలు నాటి సంరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

మొక్కలు నాటి సంరక్షించాలి

Jun 19 2026 1:00 AM | Updated on Jun 19 2026 1:00 AM

ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు అన్నారు. ఈ మేరకు గురువారం జాకారంలో వనమహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా యంత్రాంగం 12లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపా రు. ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి లక్ష్యం చేరుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా అటవిశాఖ అధికారి వికాస్‌ మీనా మాట్లాడుతూ అటవిశాఖ ఆధ్వర్యంలో శాఖల వారి కార్యాచరణకు అనుగుణంగా నర్సరీలలో మొక్కలను అందుబాటులో ఉంచామని తెలిపారు. నాటి న ప్రతీ మొక్కను సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌, అటవిశాఖ అధికారులు, సర్పంచ్‌ సమత, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement