ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలి

Jun 18 2026 1:05 AM | Updated on Jun 18 2026 1:05 AM

ఏటూరునాగారం: తల్లిదండ్రులు నమ్మకం పెట్టుకొని ప్రభుత్వ బడికి పంపితే ప్రభుత్వ ఉపాధ్యాయులు భరోసా ఇచ్చి భవిష్యత్‌ను తీర్చిదిద్దుతారని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చిన్నబోయినపల్లిలో 160 మంది అడ్మిషన్లు దాటిన సందర్భంగా డీఈఓ పుస్తకాలను పంపిణీ చేసి మాట్లాడారు. గ్రామస్తులు, యువశక్తి కష్టపడి పనిచేసిందన్నారు. రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఇక్కడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గదుల్లో ఫ్యాన్లు, దీపాలు, డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లపై దృష్టి పెడుతామని చెప్పారు. పాఠశాలకు ఒకేసారి ఆరుగురు ఉపాధ్యాయులను నియమించి విద్యాబోధన చేస్తున్నామని తెలిపారు.

జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement