వాజేడు: వర్షాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి గోపాలరావు సూచించారు. మండల పరిధిలోని వాజేడు, పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం పరిశీలించారు. రికార్డులు, హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. ఆస్పత్రిలోని గదులను పరిశీలించిన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ బదిలీపై వెళ్లిన వారి స్థానంలో వేరే వారిని నియమించనున్నట్లు తెలిపారు. వైద్యాధికారి ఉన్నత చదువుల కోసం వెళ్లిన కారణంగా ఖాళీగా ఉన్న వైద్యాధికారి పోస్టులో రెండు రోజుల్లో డిప్యూటేషన్‌పై వేరే వారిని నియమించనున్నట్లు తెలిపారు.
జిల్లా వైద్యాధికారి గోపాలరావు


