● పీఓ లెనిన్ వత్సల్ టొప్పో
ములుగు రూరల్: ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలని ఐటీడీఏ పీఓ లెనిల్ వత్సల్ టొప్పో అన్నారు. ఈ మేరకు మంగళవారం రాయినిగూడెం బాలుర ఆశ్రమ పాఠశాలను ఆయన సందర్శించి మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలన్నారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాఠశాలలో వాటర్ ప్లాంట్ మరమ్మతులు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


