● డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు
ములుగు రూరల్: ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ సమావేశ మందిరంలో పల్స్ పోలియో, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఆశ కార్యకర్తులు ఇంటింటి సర్వే నిర్వహించి 0–5 సంవత్సరాల పిల్లలను గుర్తించాలన్నారు. హైరిస్క్ ప్రాంతాల్లో పిల్లలకు మొబైల్ టీంల ద్వారా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మొదలు ఆరోగ్య సిబ్బందికి పల్స్ పోలియో కార్యక్రమంపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. వర్షాకాలం సీజన్‌లో వచ్చే వ్యాధులను అరికట్టేందుకు పీహెచ్‌సీల పరిధిలో రాపిడ్ ఫోర్స్ టీంలను తయారు చేసుకోవాలని సూచించారు. వర్షాకాలం వరద ముంపు ప్రాంతాల్లోని గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపఆరోగ్యశాఖ అధికారి సుధీర్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల నియంత్రణ అధికారి నాగ అన్వేష్, పోగ్రాం అధికారులు శ్రీకాంత్, రంజిత్, మాస్ మీడియా అధికారి సంపత్, కమ్యూనిటీ హెల్ అధికారి దుర్గారావు, శకుంతల తదితరులు పాల్గొన్నారు.
వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ
వరల్డ్ నో టొబాకో డేను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు మాట్లాడుతూ నికోటిన్, పొగాకు వ్యసనం.. ఆకర్షణను బయట పెట్టి దాన్ని ఎదుర్కోవటం అనే నినాదంతో టోబాకోడే ప్రోగ్రాం ధీమ్ అని వివరించారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో పొగాకు, సిగరేట్, బీడీ, గుట్కాలాంటివి వాడడం వల్ల క్యాన్సర్, గుండెజబ్బు, ఊపిరితిత్తులు వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయని ప్రజలకు అవగాహన కల్పించాలచారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి రంజిత్, జిల్లా ప్రోగ్రాం అధికారులు శ్రీకాంత్, నాగగణేశ్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.


