వెంకటాపురం(కె): మండల పరిధిలోని మల్లాపురం గ్రామ సమీపంలో నిర్మించిన పాలెంవాగు పాజెక్టును మంగళవారం సెంట్రల్ వాటర్ కమిషన్ బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ డిప్యూటీ డైరెక్టర్ రూపేశ్, అసిస్టెంట్ డైరెక్టర్ శరణ్యలు ప్రాజెక్టు పనుల స్థితిగతులపై ఆరా తీశారు. ప్రాజెక్టు పురోగతి, అమలులో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులో నీటి సామర్ధ్యం, ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి సాగునీరు అందుతున్న అయకట్టు వివరాలు, భవిష్యత్‌లో నీరు అందించాల్సిన ఆయకట్టు వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు కెనాల్ ఏవిధంగా ఉంది, మరమ్మతుల వివరాలు తెలసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలెం ప్రాజెక్టు ఏఈ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


