కేయూ ఫిజిక్స్‌ విభాగం బీఓఎస్‌గా నరేందర్‌ | - | Sakshi
Sakshi News home page

కేయూ ఫిజిక్స్‌ విభాగం బీఓఎస్‌గా నరేందర్‌

Jun 16 2026 1:16 AM | Updated on Jun 16 2026 1:16 AM

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని ఫిజిక్స్‌ విభాగం బోర్డు ఆఫ్‌స్డడీస్‌ చైర్మన్‌గా ఆ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నరేందర్‌ను నియమిస్తూ రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు బీఓఎస్‌గా బాధ్యతలను నిర్వర్తించిన డాక్టర్‌ వరలక్ష్మి పదవీకాలం పూర్తికావడంతో ఆమెస్థానంలో నరేందర్‌ను నియమించారు. ఈయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు నరేందర్‌కు వీసీ కె.ప్రతాప్‌రెడ్డి ఉత్తర్వులు అందించారు.

పోలీసుల అదుపులో

గంజాయి విక్రయదారులు?

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయాలు చేపడుతున్న నలుగురు వ్యక్తులను భూపాలపల్లి సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏటూరునాగారం మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు భూపాలపల్లిలో మరో ఇరువురికి విక్రయాలు చేపడుతుండగా పక్కా సమాచారంతో నిర్వహించిన తనిఖీల్లో నిందితులను పట్టుకొని వారి వద్ద నుంచి గంజాయి స్వాఽధీనం చేసుకున్నట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న వారిని విచారిస్తున్న పోలీసులు గంజాయి ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే అంశాలపై దర్యాప్తు కొనసాగుస్తున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement