ప్రజావాణి వినతులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి వినతులు పరిష్కరించాలి

Jun 16 2026 1:16 AM | Updated on Jun 16 2026 1:16 AM

– మరిన్ని ఫొటోలు 8లోu

కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు

గ్రీవెన్స్‌లో 73 దరఖాస్తుల రాక

ఎస్‌ఎస్‌తాడ్వాయి: కాటాపూర్‌ ప్రభుత్వ పాఠశాల ఆదర్శమని డీఈఓ సిద్ధార్థరెడ్డి తెలిపారు. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ఆయన మండల పరిధిలోని కాటాపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ను సోమవారం సందర్శించారు. ఈ సందర్భగా పాఠశాల హెచ్‌ఎం సుధాకర్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో డీఈఓ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపడుతుందనడానికి జెడ్పీహెచ్‌ఎస్‌ సాధించిన ఫలితాలే నిదర్శనమన్నారు. పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు ఐఐటీ బాసరలో సీట్లు సాధించడం అభినందనీయమన్నారు. పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కావడం, కొత్తగా 60 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందడం ప్రభుత్వ పాఠశాలల నాణ్యతకు నిదర్శనమన్నారు. ఉపాధ్యాయుల అంకితభావంతో పనిచేసి విద్యార్థులను చేర్పించడం అభినందనీయమని కొనియాడారు. సైన్స్‌ బోధనను ప్రయోగాత్మకంగా నిర్వహించి, విద్యార్థులు నిజజీవితంలో అన్వయించుకునేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ఉర్దూ మీడియం పాఠశాల, కాటాపూర్‌ పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. ఏఎంఓ శ్యాంసుందర్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరడం సంతోషకరమన్నారు. ఎంఈఓ గడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతోనే వందశాతం ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. సర్పంచ్‌ దిడ్డి మోహన్‌ రావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి గ్రామం తరఫున పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని డీఈఓకు వినతిపత్రం అందజేశారు.

వంట కార్మికుల వినతి

ములుగు రూరల్‌: వంట కార్మికుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ సోమవారం మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులకు, పంచాయతీ కార్మికులకు వినతి ప్రతం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 54 వేల మంది వంట కార్మికులకు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాము, అరుణ, లలిత, సారమ్మ తదితరులు ఉన్నారు.

ములుగు రూరల్‌/ఏటూరునాగారం: ప్రజావాణి వినతులను అధికారులు పరిశీలించి పరిష్కారం చూపాలని కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన 73 వినతులు స్వీకరించారు. ఇందులో ఇందిరమ్మ ఇళ్లుకు సంబంధించిన వినతులు 21 రాగా పింఛన్లు 21, ఇతర శాఖలకు సంబంధించి 31 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులకు ఫార్వర్డు చేసినట్లు కలెక్టర్‌ వెల్లడించారు.

గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి

గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో తెలిపారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో గిరిజనుల నుంచి పీఓ 32 దరఖాస్తులను స్వీకరించారు. ఏటూరునాగారం మండలం కోయగూడ ఎల్లాపురం పాఠశాలను నిర్మించడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ములుగు మండలం భూపాలపల్లి ఏహెచ్‌ఎస్‌ హాస్టల్‌ నుంచి రాయినిగూడెం ఏహెచ్‌ఎస్‌కు బదిలీ చేయాలని కోరారు. ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలం కామారంలో ఇళ్ల పట్టాలు ఇప్పించాలని.. ఇలా పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాధితులు పీఓకు వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డీసీ ప్రతాప్‌, డీడీ ఫిరంగి, ఈఈ వీరభద్రం, డీటీ అనిల్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్‌, జీసీసీ డీఎం వాణి, జియాలజిస్ట్‌ కిశోర్‌, పెసా కోఆర్డినేటర్‌ ప్రభాకర్‌, శంకర్‌ పాల్గొన్నారు.

కాటాపూర్‌ పాఠశాల ఆదర్శం

డీఈఓ సిద్ధార్థరెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement