న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2026
ములుగు: జిల్లా వ్యాప్తంగా వేసవి సెలవుల అనంతరం సోమవారం పాఠశాలలు ఘనంగా పునఃప్రారంభమయ్యాయి. ఉదయం బడిగంటలు మోగుతుండగా విద్యార్థులను ఉపాధ్యాయులు ఆత్మీయంగా ఆహ్వానించి కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలికారు.
అమావాస్య ఎఫెక్ట్.. పాఠశాలలకు నిరాకరణ
జిల్లాలో 363 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మొత్తంగా 14,034 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 2,185 మంది మాత్రమే హాజరయ్యారు. కేవలం 15.57 శాతం మాత్రమే విద్యార్థుల హాజరు శాతం నమోదైందని డీఈఓ సిద్ధార్థరెడ్డి తెలిపారు. అమావాస్య రోజునే పాఠశాలలు ప్రారంభం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపకపోవడంతో హాజరు శాతం తగ్గిపోయింది. సోమవారం అమవాస్య కావడంతో పాటు మంగళవారం సైతం సెంటిమెంటుగా భావించి తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బుధవారం నుంచి పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడనున్నాయి. ఈ మేరకు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సైతం అందించారు.
ఎల్లారెడ్డిపల్లెలో పిల్లలకు బెలూన్స్, పుష్పగుచ్ఛాలు
వెంకటాపురం(ఎం): మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలకు 90 మంది పిల్లలకు కేవలం 12 మంది మాత్రమే హాజరయ్యారు. ఎల్లారెడ్డిపల్లె ప్రాథమిక పాఠశాలలో 22 మంది విద్యార్థులకు 15 మంది హాజరయ్యారు. ఈ మేరకు పిల్లలకు బెలూన్స్, పుష్పగుచ్ఛాలను ఉపాధ్యాయులు రమేశ్, స్రవంతి అందజేసి పాఠశాలలోకి ఆహ్వానించారు.
ఉపాధ్యాయులకు పుష్పాలు అందజేస్తున్న
పూర్వ విద్యార్థులు
అమావాస్యతో తొలిరోజు
పాఠశాలలకు రాని విద్యార్థులు
విద్యార్థులకు వినూత్న స్వాగతం పలికిన ఉపాధ్యాయులు
14,034 మంది విద్యార్థులకు గాను 2,185 మంది రాక
మండలం పాఠశాలలు మొత్తం హాజరైన
విద్యార్థులు వారు
ములుగు 48 1,912 151
గోవిందరావుపేట 32 1,537 179
ఎస్‌ఎస్‌తాడ్వాయి 40 1,115 204
వెంకటాపురం(ఎం) 39 1,302 180
ఏటూరునాగారం 37 1,891 271
కన్నాయిగూడెం 21 1,005 171
మంగపేట 46 1,875 201
వాజేడు 45 1,361 359
వెంకటాపురం(కె) 55 2,036 469


