ఇసుక క్వారీ మంజూరు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఇసుక క్వారీ మంజూరు చేయాలి

May 27 2026 6:14 AM | Updated on May 27 2026 6:14 AM

ఇసుక క్వారీ మంజూరు చేయాలి

మంగపేట: మండలంలోని రమణక్కపేటలో పూర్వం నుంచి గోదావరిలో చేపలవేట కులవృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న బెస్త కులస్తులకు ఇసుక్వారీ మంజూరీ చేయాని బోట్‌మెన్‌ సొసైటీ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం విలేకర్ల సమావేశంలో సొసైటీ సభ్యులు చందర్రావు, గుమ్మళ కోటి తదితరులు మాట్లాడారు. గ్రామ సమీపంలోని గోదావరిలో డీసిల్టింగ్‌ పేరుతో ఇసుక తవ్వకాలు ప్రారంభించారన్నారు. తమ గ్రామంలో పూర్వం కోయ గిరిజనులు, ఎరుకల గిరిజనులు ఎవరూ లేరన్నారు. గ్రామ సమీపంలో ఉన్న గోదావరినదిలో తమ పూర్వికుల నుంచి చేపలవేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని తమకు బోట్‌మెన్‌ సొసైటీ ఉందన్నారు. జీఓ నంబర్‌ 84 ప్రకారం బోట్‌మెన్‌ తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి గిరిజనులకు ఇచ్చిన ఇసుకక్వారీఅనుమతులను రద్దు చేసి తమ గ్రామానికి ఇచ్చిన ఇసుక క్వారీని తమ బోట్‌మెన్‌ సొసైటీకి ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. మురళి, బట్ట రామారావు, గుమ్మళ ఆదినారాయణ, యుగందర్‌, నర్సింహారావు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement