ములుగు రూరల్: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే పూర్తిగా తగ్గించాలని సీపీఐ జిల్లా నాయకులు అంజద్ పాషా అన్నారు. సీపీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని కోరుతూ ఆదివారం ట్రాలీ ఆటోకు తాడు కట్టి లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.5పైన పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై భారం పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలను సైతం పెంచడంతో నిత్యావసర ధరలు ఆకాశనంటుతున్నాయని తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ను జీఎస్టీ పరిధిలోకి తేకుండా కార్పొరేట్ కంపెనీలకు లాభం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికై నా పెంచిన ధరలు తగ్గించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల రాజు, కొమురయ్య, బోడ రమేశ్, శ్రీను, ఓదెలు, మల్లేశ్, రవి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


