హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి

May 25 2026 9:33 AM | Updated on May 25 2026 9:33 AM

మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హే మాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివా రం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని స్వ యంభు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. హేమాచలక్షేత్రం ఆలయ పరిసరాలు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండడంతో పాటు సహజసిద్ధమైన జలపాతాలు ఉండటంతో మండు వేసవిలో భక్తులకు చల్లని ఆహ్లాదాన్ని పంచుతోంది. వివిధ వాహనాల్లో గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement