చీకుపల్లి వద్ద అసంపూర్తిగా ఉన్న రహదారి పనులు
అసంపూర్తిగా ఉన్న డ్రెయినేజీలు
వాజేడు: హైదరాబాద్, భూపాలపట్నం 163 నంబర్ జాతీయ రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మండల పరిధిలోని జగన్నాథపురం నుంచి చెరుకూరు గ్రామం వరకు ఉన్న 10 కిలో మీటర్ల జాతీయ రహదారి(డబుల్ రోడ్డు)ను ఫోర్‌వే లైన్‌గా విస్తరిస్తున్నారు. రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా గ్రామాలు ఉన్న చోట డ్రెయినేజీల నిర్మాణం చేపట్టినప్పటికీ ఎక్కడ పూర్తి కాలేదు. అదే విధంగా సర్వీస్ రోడ్డు పనులు సైతం కొనసాగుతున్నాయే తప్ప పూర్తి కావడం లేదు. రహదారి విస్తరణ పనులు ఎప్పటికి పూర్తి చేస్తారోనని ప్రజలు వాపోతున్నారు.
10 కిలో మీటర్లు రూ.120 కోట్లు
జగన్నాథపురం నుంచి చెరుకూరు గ్రామం వరకు నిర్మిస్తున్న నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.120 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో 10 కిలో మీటర్ల రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో ఇసుక వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు జూన్ నెలాకరు లోగా పూర్తి అయ్యేలా కనిపించదం లేదు. రానున్న వర్షాకాలం వాగు అవతలి వైపున ఉన్న గ్రామాలతో పాటు అంతర్రాష్ట్ర రాక పోకలకు అంతరాయం కలిగే అవకాశాలు ఉన్నాయి. మండల పరిధిలోని చీకుపల్లి, పెద్దగొళ్ల గూడెం గ్రామాల మధ్యన ఉన్న ఇసుక వాగుపై బ్రిడ్జి నిర్మాణం అనివార్యమైంది. దీంతో రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అక్కడ గతంలో ఉన్న పాత బ్రిడ్జిని తొలగించి కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టారు. బ్రిడ్జి సమీపంలో మట్టితో రోడ్డు డైవెర్షన్ రోడ్డును వేసి బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను జూన్‌లోగా పూర్తి చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇసుక వాగు అవతలి వైపున ఉన్న సుమారు 20 గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యాలతో పాటు వ్యవసాయ సంబంధిత వస్తువులు, ఎరువులు, ని త్యావసర సరుకులకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గోదావరికి వరద వస్తే ఇసుక వాగు ద్వారా వచ్చిన వరద ఇక్కడ తాత్కాలికంగా ని ర్మిస్తున్న రహదారిని ముంచెత్తే అవకాశం ఉంది. అ దే సమయంలో భారీ వర్షాలు పడితే ఈ వాగు ఉధృతంగా ప్రవహిస్తది. దీంతో తాత్కాలికంగా వేసిన రహదారి కొట్టుకుపొయే అవకాశం ఉంది. బ్రిడ్జి నిర్మాణం వర్షాలు పడక ముందు పూర్తి కాక పోతే రాక పోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. మండలంలోని సుమారు 20 గ్రామాలతో పాటు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల మధ్యన రాక పోకలు నిలిచి పోతాయి. బ్రిడ్జి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
నత్తనడకన
జాతీయ రహదారి విస్తరణ పనులు
ఇబ్బంది పడుతున్న వాహనదారులు


