బస్టాండ్‌లోనే బస్సులు | - | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌లోనే బస్సులు

May 25 2026 9:33 AM | Updated on May 25 2026 9:33 AM

టేకుమట్ల (కాళేశ్వరం): సరస్వతి అంత్య పుష్కరాలకు వేసవి ఎండ ఎఫెక్ట్‌ తాకినట్టు కనిపిస్తుంది. 44, 45, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలో అంత్య పుష్కరాలకు వెళ్లేందుకు భక్తులు విముఖత చూపుతున్నారు. అధికారుల అంచనాలకు అనుకూలమైన భక్తులు రాలేకపోతున్నరనడానికి బస్టాండ్‌లోని పుష్కర ఘాటుకు వెళ్లే బస్సులే నిదర్శనం. వివిధ ప్రాంతాల నుంచి బస్టాండ్‌కు చేరుకున్న భక్తులను బస్టాండ్‌ నుంచి ఉత్తర ఘాటు వరకు తీసుకెళ్లెందుకు ఉచిత ప్రైవేట్‌ బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడి బస్సులు అక్కడే ఉండడంతో పుష్కరాలకు వచ్చే భక్తుల తాకిడి అంతంత మాత్రమేనని తెలుస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement