న్యాయం చేయాలని ఆందోళన | - | Sakshi
Sakshi News home page

న్యాయం చేయాలని ఆందోళన

May 25 2026 9:33 AM | Updated on May 25 2026 9:33 AM

న్యాయం చేయాలని ఆందోళన

శాయంపేట : మండలంలోని కొత్తగుట్ట సింగారం గ్రామానికి చెందిన కుక్కల సారయ్య (75) గ్రామ శివారులోని పున్నం మల్లారెడ్డి ఆయిల్‌పాం తోటలో శనివారం అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం బాధిత కుటుంబ సభ్యులు, బందువులు గూడెప్పాడ్‌–పరకాల రహదారిపై ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వాహనాలు బారీగా నిలిచిపోయి ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడడంతో ఎస్సై జక్కుల పరమేశ్‌ సిబ్బందితో అక్కడికి చేరుకొని ఆందోళనకారుతో మాట్లాడారు. ఫిర్యాదు ఇస్తే బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. సీఐ సుధాకర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం పోలీసులు సారయ్య మృతదేహానికి పరకాల సివిల్‌ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా మృతుడి భార్య కుక్కల మల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement