వెంకటాపురం(కె): మండలంలో భానుడు భగభగలతో తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఆదివారం మండలంలో ఎండలు నిప్పల కొలిమిని తలపించాయి. ప్రజలు ఎండ వేడిమికి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందకు భయందోళనలకు గురవుతున్నారు. ఉదయం 6గంటల నుంచి ఉదయం 11 గంటల లోపు, సాయంత్రం 5 గంటల తర్వతనే ప్రజలు బయటకు వస్తున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు చెట్ల కింద సేద తీరుతున్నారు. దీంతో మండల కేంద్రంలో రోడ్లు అన్ని నిర్మానుష్యంగా మారాయి.
చెట్ల కింద సేద దీరుతున్న మూగ జీవాలు
చున్నీలు కప్పుకొని వెళ్తున్న మహిళలు


