చేపల విక్రయాలు | - | Sakshi
Sakshi News home page

చేపల విక్రయాలు

May 25 2026 9:33 AM | Updated on May 25 2026 9:33 AM

చేపల విక్రయాలు రోడ్డు పనులు వేగవంతం చేయాలి

మంగపేట: మండలంలోని చెరుపల్లి, బాలన్నగూడెం తదితర గ్రామాల్లో ఆదివాసీ గిరిజన మత్స్య సంఘాల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లోని చెరువుల్లో చేపలను పట్టి నాలుగు రోజుల నుంచి చెరువుల వద్దనే కేజి రూ.150కి విక్రయిస్తున్నారు. బయట మార్కెట్‌లో గోదావరి చేపలు కేజీ రూ.300 వందలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే చేపలు రూ.200 వందలకు విక్రయిస్తున్నారు. కాగా, తాజా పట్టిన చేపలను కేజీ రూ.150కి విక్రయిస్తుంటడంతో స్థానిక ప్రజలు చెరువల వద్దకు వెళ్లి ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.

మొగుళ్లపలి: రోడ్డు పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మండలంలోని అకినపల్లి నుంచి అంతడుపుల గ్రామానికి జరుగుతున్న రోడ్డు పనులను ఎమ్మెల్యే ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రోడ్డు ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల రవాణా కష్టాలను తీర్చాలని, నాణ్యతలో రాజీ పడకుండా పనులు చేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. నాయకులు పాల్గొన్నారు.

ఎన్నిక

మల్హర్‌(కాటారం): ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా అంకుసాపూర్‌ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌ కర్కా ఉమశంకర్‌ ఎన్నికయ్యారు. ఆదివారం కాటారంలో నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఉప సర్పంచులందరూ ఉమశంకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈమేరకు ఉమశంకర్‌కు ఎన్నిక నియామక ప్రతాన్ని పార్టీ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి అందించారు. తన ఎన్నికకు సహకరించిన మంత్రి దుద్దళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబుకు ఉమశంకర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement