ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐదవ వార్డుకు చెందిన బాల్య నర్సయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.15వేలు నగదును అందజేశారు. వార్డు సభ్యుడు కొండాయి చిన్ని, చంద్రబాబు, తాడూరి రఘు, మోహన్, శ్రీను, పృద్విరాజ్, హరిబాబు, శ్రీనివాస్, వెంకటస్వామి, మొగిళి పాల్గొన్నారు.
6వ వార్డులో..
మండలంలోని 6వ వార్డుకు చెందిన మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ మాదరి రామయ్య తల్లి లక్ష్మీ ఇటీవల మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబాన్ని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరావు నాయకులతో కలిసి పరామర్శించారు.


