ఎస్‌ఎస్ తాడ్వాయి: మండలంలోని కాటపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 2001–02 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. 25 ఏళ్ల అనంతరం ఒకొరినొక్కరు కలిసి తమ బాల్యాన్ని తలుచుకుంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆనంతరం వారికి అక్షరాలు నేర్పిన గురువులను శాలువాతో సన్మానించారు. సర్పంచ్ దిడ్డి మోహన్‌రావు, ఉపాధ్యాయులు ఉపేందర్, బీడీ నాయక్, రాందాస్, ప్రభాకర్, పూర్వ విద్యార్థులు పులి శ్రీలత, తడక పద్మజ, అలివేలు మంగ, సుజాత, స్వప్న, కృష్ణ, శ్రీను, దుగ్గిరాల విజయభాస్కర్, బందెల తిరుపతి, గంగెల్లి విజయ్, పల్లెర్ల గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.


